ఒకే పోస్టర్ లోఎన్టీఆర్ పవన్ కళ్యాణ్

ఈ పోస్టర్ చూసారా..ఎవరు డిజైన్ చేశారో కానీ శభాష్ అనిపించుకున్నాడు.హీరోలపై అభిమానం ఉండొచ్చు కానీ అది హద్దుల్లో ఆరోగ్య కరంగా వున్నప్పుడే అభిమానం అందంగా ఉంటుంది.హద్దులు మీరితేనే వినోద్ రాయల్ లాంటి ఘటనలు అత్యంత దురదృష్ట కరంగా సంభవిస్తుంటాయి.దీనిపై పవన్,ఎన్టీఆర్ ఇద్దరూ అభిమానం హద్దుల్లో వుండాలంటూ అలా లేని అభిమానం మాకొద్దు అని ఘాటుగానే స్పందించారు.

ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ విడుదల, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు అయిన సెప్టెంబర్ 2,వినాయక చవితి 5 న వరుసగా ఉండడంతో ఓ అభిమాని తన అభిమానాన్ని, భక్తిని ఇలా చాటుకున్నాడు.

ప్రేక్షకులకి వినాయక చవితి శుభాకాంక్షలు,ఎన్టీఆర్ అభిమానులందరికి జనతా గ్యారేజ్ విడుదల సందర్భంగా అల్ ది బెస్ట్,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి అడ్వాన్స్డ్ బర్త్ డే విషెస్ అంటూ డిజైన్ చేసిన ఈ పోస్టర్ పై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.ఆన్లైన్ లో ఈ పిక్ ఇప్పటికే వైరల్ గా మారింది.ఇలాంటివి చూసైనా అందరి హీరోల అభిమానులూ క్షణికావేశాల్ని వదిలి స్నేహ పూర్వక వాతావరణం లో వుండాలని ఆశిద్దాం.