ఇంకొక్కడు TJ రివ్యూ

సినిమా : ఇంకొక్కడు.
టాగ్ లైన్: అభిమానులకి మాత్రమే ఇంకొక్కడు
రేటింగ్: 2.5/5
న‌టీన‌టులు : విక్రమ్, నయనతార, నిత్య మీనన్, నాస్సర్, తంబీ రామయ్య,
సినిమాటోగ్ర‌ఫీ : R D రాజశేఖర్.
నిర్మాత : నీలం కృష్ణ రెడ్డి.
బ్యానర్ ; NRK ఫిలిమ్స్.
ఎడిటింగ్‌ : భువన్ శ్రీనివాసన్.
ఆర్ట్ ; సురేష్ సెల్వరాజన్.
సంగీతం : హరీశ్ జయరాజ్.
స్క్రీన్ ప్లే/కథ/దర్శకత్వం : ఆనంద్ శేఖర్.

విక్రమ్ సినిమా అంటేనే ప్రేక్షకుల్లో ఓ క్రేజ్ ఉంది. కమర్షియల్ సినిమాలకంటే భిన్నంగా ఉండే విలక్షణ చిత్రాలనే చేయటానికి ఇష్టపడతాడు విక్రమ్. ఇష్టపడటమే కాకుండా ఆ పాత్రలలో జీవిస్తాడు. ఇంతకుముందు విక్రమ్ నటించిన అపరిచితుడు, నాన్న, ఐ చిత్రాలని చుస్తేనే తెలుస్తుంది ఆయనకీ పాత్రలపై వుండే ఇష్టం, పాత్రకు తగ్గట్టు శరీరాకృతిని కూడా మార్చేసుకుంటాడు. ఇలాంటి విలక్షణ నటుడు విక్రమ్ కు తెలుగు, తమిళంలో అపరిచితుడు తర్వాత ఆ రేంజ్ హిట్ లేదు. దాంతో ఎలాగైనా మళ్ళీ హిట్ కొట్టాలనే ఉద్దేశంతో డిఫరెంట్ గా ఉండాలనే ఇంకొక్కడు సబ్జెక్ట్ ను ఎంపిక చేసుకున్నాడు.

రెండోప్రపంచ యుద్ధం లో హిట్లర్ అవలంబించిన ఒక విధానాన్ని కథాంశంగా తీసుకుని ఇంకొక్కడు సినిమాని తీసాడు డైరెక్టర్ ఆనంద్ శేఖర్. ఈ సినిమాలో హీరోగా(అఖిల్) రా ఏజెంట్, విలన్(లవ్) గా విక్రమ్ ద్విపాత్రాభినయం చేసాడు . లవ్ పాత్రలో ట్రాన్స్ జెండర్ గా చాలాబాగా మెప్పించాడు విక్రమ్ నటనలో మరో కొత్త కోణాన్ని ఆవిష్కరించింది ఈ పాత్ర. ఇంకా హీరోయిన్స్ నయనతార, నిత్యామీనన్ లు తమ తమ పరిధిలో బాగానే నటించారు.

ఫస్ట్ హాఫ్ బాగానే ఉన్నప్పటికీ సెకండ్ హాఫ్ లో చేజ్ లు ఫైట్స్ తో సరిపోతుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది కానీ సినిమా మధ్య లో వచ్చే పాటలు బోర్ కొట్టించాయి. రా ఏజెంట్ గా విక్రమ్ మొదటిసారి లవ్ ని ఎందుకు చంపుతాడు? అనే తరహా ప్రశ్నలకు క్లారిటీ ఇవ్వలేదు. ఫైనల్ గా విక్రమ్ స్టైల్ మూవీస్ ని ఇష్టపడే వారికి మాత్రమే ఈ సినిమా నచ్చుతుంది.