DJ గా అల్లుఅర్జున్

స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్, దిల్ రాజు, హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న కొత్త చిత్రం `డి.జె…దువ్వాడ జగన్నాథమ్`.

స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా గబ్బర్ సింగ్ వంటి ఇండస్ట్రీ హిట్ ను అందించిన డైరెక్టర్ హరీష్ శంకర్.ఎస్ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు నిర్మాతగా కొత్త చిత్రం `డి.జె….దువ్వాడ జగన్నాథమ్` సినిమా రూపొందనుంది. ఆర్య, పరుగు వంటి హిట్ చిత్రాలు తర్వాత అల్లుఅర్జున్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో చేస్తున్న మూడో చిత్రమిది. అంతే కాకుండా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో రూపొందనున్న 25వ సినిమా కూడా ఇదే కావడం విశేషం.

బన్నితో ఆర్య, ఆర్య2, సన్నాఫ్ సత్యమూర్తి, జులాయి సహా… శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో ఆర్య, బొమ్మరిల్లు వంటి సూపర్ హిట్ చిత్రాలకు సంగీతం అందించిన రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. అల్లుఅర్జున్, దిల్ రాజు, హరీష్ శంకర్, దేవిశ్రీ ప్రసాద్ ల కాంబినేషన్ తో రూపొందనున్న డి.జె….దువ్వాడ జగన్నాథమ్` ఈ రోజు (ఆగస్ట్ 29) హైదరాబాద్ ఫిలింనగర్ దైవ సన్నిధానంలో ఉదయం 7గంటల 15 నిమిషాలకు లాంచనంగా ప్రారంభం అయింది. ఈ వేడుకకు పలువురు సినీ ప్రముఖులు హాజరు రయ్యారు.