2019 ఎన్నికలే టార్గెట్ గా జనసేన

జ‌న‌సేన విజృంభిస్తోంది! ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్థాపించిన జ‌న‌సేన పార్టీ ఇక యాక్టివ్‌గా పాలిటిక్స్‌లోకి వ‌చ్చేస్తోంది. ఎట్టి ప‌రిస్థితిలోనూ 2019 సాధార‌ణ ఎన్నిక‌ల్లో ఏపీలో జ‌న‌సేన టాప్ పొలిటిక‌ల్ పార్టీగా నిల‌బ‌డేలా ప‌వ‌న్ తెర‌వెన‌క క‌స‌ర‌త్తులు స్టార్ట్ చేసిన‌ట్టు తెలుస్తోంది.ఇందులో భాగంగా జ‌న‌సేన‌కు ప‌వ‌ర్ ఫుల్ టీంను ఆయ‌న సిద్ధం చేస్తున్నట్టు స‌మాచారం.

ఇందుకోసం ప‌వ‌న్ త‌న‌కు కావాల్సిన‌, త‌ను కోరుకుంటున్న ల‌క్షణాలున్న నేత‌ల‌ను ఎంచుకుంటున్నార‌ట‌. వారిలో గ‌తంలో కేంద్ర మంత్రులుగా పనిచేసి ప్రస్తుతం బీజేపీలో అంత ప్రాధాన్యం లేకుండా పోయిన ఇద్దరు నేతలతో పాటు గుంటూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి, విజయవాడకి చెందిన ఓ మాజీ ఎంపీతో పాటు ఉత్తరాంధ్రకు చెందిన‌ మంత్రి, టీడీపీనేతతో పాటు రాయలసీమలో బలమైన రెడ్డి నేత జ‌న‌సేన‌కు జైకొట్టేందుకు, ఆ పార్టీ కండువా క‌ప్పుకునేందుకు సిద్ధమ‌య్యార‌ట‌. వీరితోనే ప‌వ‌న్ పార్టీని న‌డిపించ‌నున్నట్టు స‌మాచారం.

ఇక‌, వీరంతా ఆర్థికంగా ప‌వ‌న్‌కు ఫుల్లుగా స‌పోర్ట్ చేస్తార‌ని టాక్. ఈ ఈక్వేష‌న్స్ దృష్ట్యా వ‌చ్చే ఎన్నిక‌లు గ‌తం క‌న్నా భిన్నంగా ఉండ‌బోతున్నాయ‌న్నది వాస్త‌వం. డ‌బ్బు, కులం ఓట్లు ఖ‌చ్చితంగా 2019 ఎన్నిక‌ల్లో ప్రధాన పాత్రను పోషించ‌నున్నాయి.ప‌వ‌న్ అన్ని కులాల‌కు చెందిన వారితోనే త‌న టీంను ఏర్పాటు చేస్తున్నాడ‌ట. అలాగే ఎప్పుడు ఎవ‌రో ఒక‌రి సాయంతో ఎన్నిక‌ల‌కు వెళ్లే కామ్రేడ్లు క‌ల‌సి వ‌స్తామంటే వారితోనూ జ‌త‌క‌ట్టాల‌ని ప‌వ‌న్ భావిస్తున్నాడ‌ట‌. దీంతో ప్ర‌స్తుత అధికార టీడీపీ, విప‌క్ష వైసీపీల‌కు గ‌ట్టి పోటీ ఇచ్చేదిశ‌గా ప‌వ‌ర్ స్టార్ పార్టీ రెడీ అవుతోంద‌ని లెక్కలు వేస్తున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. మ‌రి ఇదే నిజ‌మైతే.. ప‌వ‌న్ ఓ స‌రికొత్త రాజ‌కీయ నాయ‌కుడిగా మార‌తాడు..మ‌రి ఫైన‌ల్‌గా ఏం జ‌రుగుతుందో చూద్దాం..!