సందడిగా టాలీవుడ్ బాక్సాఫీస్

టాలీవుడ్ కు లాస్ట్ వీక్ నుంచి వస్తోన్న హిట్లతో బాక్సాఫీస్ భలే జోరు మీదుంది.దీనికి తోడు ఈవారం వచ్చే రెండు చిత్రాలతో థియేటర్ల మ్యాటర్… మళ్లీ లైమ్ లైట్లో కొచ్చింది. ఇప్పటికే ఆడుతోన్న మూడు సినిమాలు మాంచి మూడ్ లో ఉండడంతో… వచ్చే సినిమాలకు ప్రేక్షకుల రెస్పాన్స్ ఎలా ఉంటుందా అని ప్రేక్షకులు చెబుతున్నారు.

టాలీవుడ్ కి ఆగస్ట్- సెప్టెంబర్ నెలలు ఇప్పటికే ఫుల్ ప్యాక్ అయిపోయాయి. ఆగస్టులో మొదటి శుక్రవారమే రెండు సినిమాలు థియేటర్లలోకి వచ్చేయగా.. శ్రీరస్తు శుభమస్తు- పెళ్లి చూపులు రెండు చిత్రాలకు హిట్ టాక్ వచ్చేసింది. కలెక్షన్స్ కూడా బాగా వస్తున్నాయి. అయితే.. ఈ రెండు సినిమాలకు భారీభారీ వసూళ్లు సాధించే సత్తా మాత్రం లేదు. ఇంకా చెప్పాలంటే బ్లాక్ బస్టర్ అనేసే రేంజ్ హిట్స్ అవుతాయనే హోప్స్ లేవు.కాని ఓకే అనిపించుకున్నాయి.

ఇక ఈ వారం ఆగస్టు 12న వెంకటేష్ నటించిన బాబు బంగారంతో పాటు మెగా హీరో సాయి ధరం తేజ్ నటించిన తిక్క రిలీజ్ కానుంది. ఆ తర్వాత వారం ఆగస్టు 19 కూడా రెండు సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి. ఆది నటించిన చుట్టాలబ్బాయి.. సుశాంత్ హీరోగా ఆటాడుకుందాం రా మూవీలు విడుదల కానున్నాయి. మరి వీటిలో అయినా బ్లాక్ బస్టర్ అనిపించుకునే సినిమా ఏదన్నా ఉందా అన్నదే అసలు పాయింట్.

జూన్ లో అ..ఆ.. – జెంటిల్మన్ తర్వాత థియేటర్లు కళకళ్లాడలేదు. కబాలితో రజినీకాంత్ అయినా మెరిపిస్తాడనుకుంటే చివరకు ఏడిపించేశాడు. ఇప్పుడీ నాలుగు సినిమాల్లో ఏదైనా బ్లాక్ బస్టర్ అనిపించుకుంటే.. అటు థియేటర్లకు.. ఇటు ఆడియన్స్ కు ఫుల్లు పండగే.