పీక్స్ లో ప్రియాంక ఎక్స్ పోజ్!

బాలీవుడ్ నుంచి హాలీవుడ్ కి జంప్ అవ్వడం సంగతేమో గానీ.. ప్రియాంక చోప్రా రేంజ్ మామూలుగా పెరిగిపోలేదు. ఈ మధ్య కాలంలో పీసీ కనిపించినంతగా కవర్ పేజ్ పై ఏ హీరోయిన్ కూడా మెరిసిపోయి ఉండదు.  ఆస్పైసీ పోజుల ముచ్చట మీకోసం. ఫ్యాషన్ గాళ్ ప్రియాంకా చోప్రా వరుసగా హాలీవుడ్ మేగజైన్స్ అన్నీ ఎక్కేయడం అంటే అదేమీ చిన్నా చితగా మ్యాటర్ కాదు.

కొన్ని నెలలు గ్యాప్ ఇచ్చి.. మళ్లీ మేగజైన్ లను వరుసగా రౌండ్స్ వేసేస్తోంది ప్రియాంక చోప్రా. బాలీవుడ్ లో ఉండగానే జీక్యూ మేగజైన్ పై మెరిసిపోయిన పీసీ.. అప్పుడు హాలీవుడ్ హాట్ సెలబ్రిటీగా కవర్ పేజ్ ఎక్కేసింది. ఇప్పుడు రేంజ్ మారింది కాబట్టి.. అందాల డోస్ లో కూడా తేడా వచ్చింది. బాలీవుడ్ లోనే క్లీవేజ్ షోస్ కామన్ అయిపోయిన టైమ్ లో.. అంతకు మించి అన్నట్లుగా హాలీవుడ్ కవర్ పేజ్ లపై సందడి చేస్తోంది.

వయ్యారాలు ఒలకబొయ్యడంతో పాటే.. మెలికలు తిరిగిపోతూ.. అభిమానుల మనసులు మెలితిప్పేస్తోంది. జీక్యూ మేగజైన్ ఆగస్ట్ ఎడిషన్ లో అమ్మడు ఇంతలా రెచ్చిపోయింది. తన వయ్యారి నడుమును ఓ వైపు విసిరేసి.. ఒంపు సొంపులను మరోవైపు తోసేసి.. కళ్లతోనే కాటేస్తానంటున్న ప్రియాంకను చూసి ఫ్యాన్స్ కేకలు పెట్టేసుకుంటున్నారు.