నయీమ్ నడిపిన నిర్మాతలు వీళ్ళే

నయీమ్ కేసు దర్యాప్తు ఓ వైపు సాగుతుంటే అందరిలోనూ ఒకటే సందేహం ఏంటా ఇప్పటిదాకా నయీమ్ కి టాలీవుడ్ తో సంబంధాలు బయటపడలేదు అని.దీనికి కారణం లేకపోలేదు..దావూద్ ఇబ్రహీం దగ్గరి నుండి చోటా మోటా గ్యాంగ్ స్టర్స్ వరకు సినిమా ఇండస్ట్రీ పైన అందరూ ఓ కన్నేసినవారే.అదే పంథాలో నయీమ్ కూడా ఎక్కడో ఒకచోట టాలీవుడ్ సంబంధాలు బయటపడతాయని అందరూ ఊహిస్తూ వచ్చారు.

తాజాగా నట్టికుమార్ రూపంలో ఆ బాంబు పేలింది.నిర్మాత నట్టికుమార్ తొలిసారిగా మీడియా ముందుకొచ్చి టాలీవుడ్ పై నయీమ్ నీడ చాలా పెద్దదే అంటూ చెప్పుకొచ్చాడు.నయీమ్ బాధితుల్లో తాను ఒకడినని..తన థియేటర్ ని ఇచ్ఛాపురం లో అన్యాయంగా నయీమ్ లాక్కున్నా ఐఏఎస్,IPS ,క్యాడర్ అధికారులే ఏం చేయలేక పోయారని..ఇక ఏపీ మంత్రి అచ్చింనాయుడయితే నన్ను కూర్చొని నయీమ్ తో సెటిల్ చేసుకోమన్నాడని..దీన్ని బట్టే నయీమ్ కి అచ్చంనాయుడితో సంబంధాలున్నాయని ఆరోపించాడు నట్టికుమార్.

ఇక టాలీవుడ్ లో పెద్ద తలలు చాలా వాటి వెనుక నయీమ్ హ్యాండ్ ఉందని.వారిలో ముక్యంగా బడా నిర్మాతలైన సి.కళ్యాణ్,అశోక్‌కుమార్,బూరుగుపల్లి శివరామ కృష్ణ,వంటి వాళ్లంతా నయీమ్ అండతోనే ఎదిగారన్నారు.ఇంకా బండ్ల గణేష్ నిర్మాత అవ్వడం వెనుక హీరో సచిన్ జోషి ఉన్నాడని..అయితే బండ్ల గణేష్ తో ఆర్ధిక లావాదేవీల్లో వివాదం తలెత్తడం తో సచిన్ నయీమ్ ను ఆశ్రయించాడని,ఆ తర్వాత ఏం జరిగిందో తనకు తెలియదన్నారు నట్టికుమార్,

ఇదొక్కటే కాదు..శ్రీకాకుళం నుండి గుంటూరు జిల్లా వరకు దాదాపు అన్ని థియేటర్స్ లో నయీమ్ క్యాంటిన్ దందా నడుస్తోందని.అడ్డొచ్చిన తనలాంటి వాళ్ళ థియేటర్స్ అన్యాయంగా లాక్కున్నారని నట్టికుమార్ చెప్తున్నాడు.నట్టికుమార్ లాగా ఇంకా ఎంత మంది టాలీవుడ్ ప్రముఖులు బయటకి వస్తారో  ఎంతమంది బడాబాబుల పేర్లు బయటికొస్తాయో అన్నది ఆసక్తి కరంగా మారింది.