కోహ్లీ అప్పుడలా ఇప్పుడిలా!

ఎంతటి  ఉన్నత స్థాయి వారికైనా కొన్ని నెరవేరని కోరికలు ఉంటాయి.  అవి సాకారం అయితే అంతకంటే మించిన సంతోషం మరొకటి ఉండదు. స్టార్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీకి కూడా అలాంటి  కోరిక  ఒకటి ఉండేది. ఒకప్పటి క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ ను చూస్తే చాలనుకునేవాడట. విరాట్‌ 10 ఏళ్ల క్రితం తోటి క్రికెటర్లతో కలిసి ఓ ఫొటో దిగాడు. అందులో రాహుల్‌ ద్రవిడ్‌ కూడా ఉన్నారు. ఫొటోలో విరాట్‌ కెమెరా వైపు చూడకుండా రాహుల్‌నే చూస్తున్నాడు.

ఇది ఒకప్పటి మాట. ఇటీవల రాహుల్‌… విరాట్‌ని ఇంటర్వ్యూ చేశారు. ఈ ఫొటోను విరాట్‌ ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకుంటూ ‘ఒకప్పుడు రాహుల్‌ని చూస్తే చాలనుకునేవాణ్ణి. ఇప్పుడు ఆ లెజెండే నేను టెస్ట్‌ క్రికెట్‌ ఆడుతున్న సందర్భంగా ఇంటర్వ్యూ చేశారు. ఇలాంటి రోజుల్ని తలుచుకుంటే ఎంతో గర్వంగా ఉంటుంది. కలలు నిజం అవడమంటే ఇదేనేమో’ అని ట్వీట్‌ చేశాడు విరాట్‌.