కొడుకు కోడలుతో పెళ్ళికి నాగ్

నాగార్జున ఆప్త మిత్రుడు,బిజినెస్ పార్టనర్ నిమ్మగడ్డ ప్రసాద్ కుమార్తె వివాహ వేడుక హైదరాబాద్ లో అట్టహాసంగా జరిగింది.ఈ వివాహ వేడుకకి నాగార్జున తో పాటు తన ఇద్దరు కొడుకులు అఖిల్,నాగ చైతన్య కూడా హాజరయ్యారు..ఇందులో వింతేముంది అనుకుంటున్నారా..అయితే ఇదిగో ఈ వేడుకకి సమంత కూడా నాగ చైతన్యతో కలిసి రావడం విశేషం.

వివాహ వేడుకలో అందరి దృష్టి నాగ్ ఫామిలీ పైనే ఉంది.నాగ్ ఆప్యాయంగా సమంతకు వెల్కమ్ చెప్పడం..అఖిల్ కూడా సమంత తో సరదాగా కబుర్లాడుతుండడం చుసిన వాళ్లంతా సమంతా అప్పుడే అక్కినేని ఇంటి కోడలు అయిపోయిందనుకున్నారు.

ఎప్పటినుండో ఈ ప్రేమ పక్షులు సమంత,నాగచైతన్య పబ్లిక్ గా విహరిస్తూనే వున్నారు.అయితే ఇప్పటి వరకు ఏ ఒక్కరూ ఈ విషయం పై ఓపెన్ గా స్పందించలేదు..అయితే మీడియా లో రక రకాల పుకార్లు షికార్లు చేస్తూనే వున్నాయి..వీరి ఎంగేజ్మెంట్ అని,పెళ్ళని,హనీమూన్ అని..మళ్ళీ నాగ్ ఒప్పుకోలేదని ఇలా ఒకటా రెండా..ఈ పెళ్లివేడుకలో వీరందిరిని చూస్తే క్లియర్ గా క్లారిటీ గా ఒకటే అర్థం అవుతోంది…ఎవరెన్ని అనుకున్న మా క్లారిటీ మాకుంది..సమంతే నా కొడాలన్నట్టు నాగ్..సమంతే నా వైఫ్ అని చైతు..మావదిన సమంతే అన్నట్టుగా అఖిల్ వున్నారు.