కేజ్రీవాల్‌, లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మధ్య మరో వివాదం

దేశ రాజధాని ప్రాంతం పరిపాలనాధిపతిగా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ కొనసాగుతారని ఇటీవలే హైకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ సలహాలకు లెఫ్టినెంట్ గవర్నర్ కట్టుబడి ఉండనక్కరలేదని కూడా హైకోర్టు ఈ సందర్భంగా స్పష్టం చేసింది.

దీంతో ఇప్పుడు లెఫ్టినెంట్ గవర్నర్, కేజ్రీవాల్ మధ్య మరో వివాదం చెలరేగేలా కనిపిస్తోంది. ఫైళ్లను తనకు పంపించాలని ప్రభుత్వానికి లెఫ్టినెంట్ గవర్నర్ లేఖ రాశారు. ఫైళ్ల వివరాలన్నింటినీ నజీబ్ జంగ్ కోరారు. దీనిపై కేజ్రీవాల్ ప్రభుత్వ స్పందన ఎలా ఉంటుందో చూడాలి.