కరువులో అధిక మాసం పూరీనే

దర్శకుడు పూరి జగన్నాథ్ హవా కాస్త మందగించింది. వరుసగా సినిమాలు నిరాశపరుస్తుండడంతో పూరి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కున్నాడనే టాక్ ఉంది. అయితే.. ఈ ఎఫెక్ట్ ఆయన రెమ్యునరేషన్‌పై ఏమాత్రం పడలేదని తెలుస్తోంది. పూరి ప్రస్తుతం కల్యాణ్ రామ్‌తో ఇజం చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీ కోసం ఆయన తీసుకుంటున్న పేమెంట్ ప్యాకేజీ అదిరిందని సినీజనాలు అంటున్నారు.

‘ఇజం’ మూవీకి సంబంధించి చాలా భాగం షూటింగ్ కంప్లీట్ అయిపోగా.. వచ్చే నెలాఖరునాటికి ఈ మూవీని రిలీజ్ చేయాలన్నది పూరి ప్లాన్. అయితే.. ఈ సినిమా కోసం ఆయన రూ.8కోట్లు పుచ్చుకున్నాడట. కళ్యాణ్ రామ్ స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి మొత్తం బడ్జెట్ రూ. 20 కోట్లు అని అంటున్నారు. అంటే పూరీకిచ్చే రూ.8కోట్లు పోగా.. మిగిలిన రూ.12కోట్లలోనే ఇతర నటీనటులు.. టెక్నీషియన్లు.. ప్రొడక్షన్ కాస్ట్ ఉంటాయన్న మాట. ప్రతికూల పరిస్థితిలోనూ పూరి ఇంత పెద్ద మొత్తంలో రెమ్యూనరేషన్ అందుకోగలిగాడంటే ఆయన టాలెంట్‌పై నిర్మాత-నటీనటులకున్న నమ్మకం అని అంటున్నారు.