అమలాపాల్‌ అటు నుంచి ఇటు.

అమలాపాల్‌ విడాకుల విషయమై ఈ మధ్య చాలా రకాల వార్తలు మీడియాలో హల్‌ చల్‌ చేశాయి. మొత్తానికి ఈ గొడవంతా ఎలాగో సర్దుమణిగిందిలే. ఇకపై అమలాపాల్‌ తమిళంలో వరుస అవకాశాలతో బిజీ అయిపోతుంది అనుకుంటే ఇంతలో ఆమెకు అక్కడ చుక్కెదురైంది. తమిళంలో కొత్త అవకాశాల సంగతి ఏమో గానీ, వచ్చిన అవకాశాలే దూరం అయిపోతున్నాయని సమాచారమ్‌. దాంతో ఆమె దృష్టి తెలుగు ఇండస్ట్రీ మీద పడింది. అమలాపాల్‌ తెలుగు ప్రేక్షకులకి కూడా సుపరిచితురాలే. గతంలో అల్లు అర్జున్‌తో ‘ఇద్దరమ్మాయిలతో’ సినిమాలో నటించింది. నాగచైతన్యతో ‘బెజవాడ’ సినిమాలో కూడా నటించింది.

ఈ ముద్దుగుమ్మ చరణ్‌తో చేసిన ‘నాయక్‌’ సూపర్‌ డూపర్‌ హిట్‌ అయ్యింది. సో తెలుగులో మళ్లీ తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటోంది. ఇప్పటికే ఆమెకు బన్నీ సినిమాలో ఒక ఆఫర్‌ వచ్చిందని సమాచారమ్‌. బన్నీ, హరీష్‌ శంకర్‌ సినిమాలో అమలాపాల్‌ కోసం ఒక పాత్ర రెడీ అయ్యిందని తెలుస్తోంది. తక్కువ నిడివి ఉన్న పాత్ర అయినా ఆ పాత్ర సినిమాకు కీలకంగా ఉండబోతోందట. గతంలో ‘ఇద్దరమ్మాయిలతో’ సినిమాలో మెయిన్‌ హీరోయిన్‌గా నటించింది ఈ ముద్దుగుమ్మ. ఇప్పుడు గెస్ట్‌ రోల్‌లో బన్నీ సినిమాతోనే తెలుగులో రీ ఎంట్రీ ఇస్తోంది. మరి ఈ అమ్మడికి ఇక్కడైనా టైం కలిసొస్తుందా? వరుస అవకాశాలతో బిజీ అవుతుందో లేదో చూడాలిక.