మహేషా మజాకా:లైన్లో అన్ని సినిమాలా!

‘బ్రహ్మూెత్సవం’ తర్వాతి సినిమాకి ఎక్కువగా హైప్‌ క్రియేట్‌ చేయకూడదని అనుకుంటున్నట్టున్నాడు సూపర్‌ స్టార్‌ మహేష్‌. అంతా సైలెంట్‌గా చేసుకెళ్ళిపోతున్నాడట తన కొత్త సినిమా కోసం. మురుగదాస్‌ దర్శకత్వంలో చేస్తున్న ఈ సినిమాపై మహేష్‌ ఎంత వద్దన్నా హైప్‌ క్రియేట్‌ అవుతూనే ఉంటుంది. ఇంకో వైపున మురుగదాస్‌ తర్వాత చేయబోయే సినిమాల కసరత్తూ ఓ కొలిక్కి వచ్చిందని సమాచారమ్‌.

పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో మహేష్‌ హీరోగా సినిమా ఎప్పుడో ఫైనలైజ్‌ అయిపోయింది. అయితే మురుగదాస్‌తో చేసిన తర్వాతే పూరితో మహేష్‌ సినిమా చేస్తాడు. పూరి సినిమా కన్నా ముందుగానీ లేదంటే ఆ తర్వాతగానీ మహేష్‌, వంశీ పైడిపల్లితో ఓ సినిమా చేసే ఛాన్సుంది. కొరటాల శివతో ‘శ్రీమంతుడు’ తర్వాత ఇంకో సినిమా చేయడానికి గతంలోనే ఒప్పందం కుదుర్చుకున్నాడట మహేష్‌. ‘బ్రహ్మూెత్సవం’ ఫ్లాపయినా శ్రీకాంత్‌ అడ్డాలతో మహేష్‌ మరో సినిమా చేస్తాడట. ఇంత లిస్ట్‌లోనూ ఎంత బిజీనెస్‌ ఉన్నా తన ఆప్తమిత్రుడు త్రివిక్రమ్‌తో మహేష్‌ ఓ సినిమా తప్పక చేస్తాడు. ఇక టాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజమౌళి తో ఒక సినిమా చేస్తానని ఎప్పుడో మాటిచ్చాడు ప్రిన్స్.

వీటిలో మురుగుదాస్ సినిమా తరువాత ఏ సినిమా మొదలవుతుందో అన్నది ఆసక్తి కరంగా మారింది.మొత్తానికి కొంచెం ముందు వెనుకా అయినా మహేష్ తదుపరి సినిమాలు మాత్రం ఇవే అని ఖచ్చితంగా తెలుస్తోంది.దేన్నీ మిస్సవకుండా అన్నీ వర్కవుట్‌ చెయ్యాలనే ఆలోచనతో ఉన్న మహేష్‌, జాగ్రత్తగా కెరీర్‌ని డిజైన్‌ చేసుకోవడంలో నిమగ్నమయ్యాడట. ఎంతైనా మహేష్‌ గ్రేటే. డైరెక్టర్స్‌ ఫ్రెండ్లీ హీరో అనిపించుకోడమంటే ఆషామాషీ కాదు. దటీజ్‌ సూపర్‌ స్టార్‌ మహేష్‌.