రవితేజకి ఏమయ్యింది !

హీరో రవితేజకి ఏమయ్యింది? అని సినీ వర్గాల్లో ఆందోళన నెలకొంది. ఎందుకంటే రవితేజ చకచకా సినిమాలు చేసేస్తాడు కానీ ఇప్పటిలా ఇంతకుముందెన్నడూ అతను గ్యాప్‌ తీసుకోలేదు. ‘రాబిన్‌హుడ్‌’ అనే సినిమా ఫైనల్‌ అయ్యిందని కొన్నాళ్ళ క్రితం వరకూ అనుకున్నా అది పట్టాలెక్కలేదు. ఇంకో ఇద్దరు ముగ్గురు దర్శకులతో రవితేజ సినిమాలు చేస్తాడనే వార్తలొచ్చినా అవీ కేవలం ఊహాగానాలుగానే మిగిలిపోయాయి. దాంతో రవితేజ అభిమానుల్లో టెన్షన్‌ పెరిగింది.

ఆ మధ్య సిక్స్‌ ప్యాక్‌ కోసం ప్రయత్నించిన రవితేజ ఆ ఫొటోల్ని అయితే అనధికారికంగా విడుదల చేశాడుగానీ, సినిమా పరంగా రవితేజ నుంచి ఎలాంటి అనౌన్స్‌మెంట్‌ లేదెందుకో! అయితే తన ఫిజిక్‌ విషయంలో రవితేజ ఈ మధ్య కొన్ని విమర్శలు ఎదుర్కొన్నాడు. సన్నబడాలనే నెపంతో బాగా సన్నబడి అందవిహీనంగా తయారయ్యాడు రవితేజ. ఇంత బక్కపలచని పర్సనాలిటీతో ఉన్న రవితేజను చూడడానికి అభిమానులే అయిష్టం చూపడంతో రవితేజ మునుపటి తన పర్సనాలిటీ కోసం ట్రై చేస్తున్నాడనీ సమాచారమ్‌.

ఏది ఏమైనా ఈ లోగా ఎవరో ఒక డైరెక్టర్‌తో రవితేజ సినిమా పట్టాలెక్కించకపోతే ప్రేక్షకులు ఆయన్ని మర్చిపోయే అవకాశం కూడా ఉంది. అందుకే రవితేజకి ఉన్నపళంగా ఒక పెద్ద బ్రేక్‌ కావాలి. అసలు సినిమా చేయడానికి తొందరపడితేనే కదా బ్రేక్‌ వస్తుందో లేదో తెలిసేది. సో రవితేజ మూవ్‌ ఫాస్ట్‌.