మహేష్‌ 8 ప్యాక్‌ బాడీ రెడీ! 

సిక్స్‌ ప్యాక్‌ బాడీతో సునీల్‌తో సహా చాలా మంది హీరోలు దర్శనమిచ్చారు. కండలు తిరిగిన శరీరంతో తెరపై ప్రత్యర్థుల్ని చితక్కొట్టేశారు. తెలుగులో ఈ ట్రెండ్‌కి శ్రీకారం చుట్టింది అల్లు అర్జున్‌. ఆ తర్వాత నితిన్‌, ఇంకొందరు హీరోలు సిక్స్‌ప్యాక్‌తో సందడి చేశారు. కొత్త హీరోలకైతే సిక్స్‌ ప్యాక్‌ తప్పనిసరైపోయింది.

కానీ సూపర్‌ స్టార్‌ మహేష్‌ మాత్రం ఇంతవరకు సిక్స్‌ ప్యాక్‌ జోలికి పోలేదు. ‘1 – నేనొక్కడినే’ సినిమాకి సిక్స్‌ పాక్‌ కోసం ట్రై చేశాడు కానీ వర్కవుట్‌ కాలేదు. తాజాగా మహేష్‌బాబు, మురుగదాస్‌తో చేస్తున్న సినిమా కోసం 8 ప్యాక్‌ బాడీ ప్రదర్శించనున్నాడంటూ టాక్‌ వినవస్తోంది. విదేశాల నుంచి ట్రైనర్‌ని తెప్పించుకుని 8 ప్యాక్‌ కసరత్తులు చేస్తున్నాడు. ఇప్పటిదాకా 8 ప్యాక్‌ చేసిన టాలీవుడ్‌ హీరో ఎవరన్నా ఉంటే అది నితిన్‌ మాత్రమే. ఆ తర్వాత మహేష్‌దే ఈ రికార్డ్‌.

మురుగదాస్‌ డైరెక్షన్‌లో మహేష్‌ చేస్తున్న సినిమాలో ముద్దుగుమ్మ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. త్వరలో ఈ సినిమా సెట్స్‌ మీదికెళ్లనుంది. మహేష్‌బాబు పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ని కూడా విడుదల చేసేందుకు మురుగదాస్‌ సన్నాహాలు చేస్తున్నాడట. భారీ బడ్జెట్‌ మూవీగా ఈ సినిమా రూపొందబోతోంది. ‘బ్రహ్మూెత్సవం’ పరాజయం తర్వాత వస్తున్న ఈ సినిమాపై మహేష్‌కు అంచనాలు ఎక్కువే ఉన్నాయి. అంతేకాదు ఈ సినిమా చేస్తుండగానే మరో సినిమాకి మహేష్‌ ఓకే చేసినట్లు సమాచారమ్‌. ఏకకాలంలో రెండు సినిమాల షూటింగ్స్‌లో పాల్గొనాలని అనుకుంటున్నాడట మహేష్‌. మురుగదాస్‌ సినిమా ఒకేసారి తెలుగులోనూ, తమిళంలోనూ విడుదల కానుంది. ఈ సినిమాలో మహేష్‌ని చాలా స్టైలిష్‌ లుక్‌లో చూపించబోతున్నాడట మురుగదాస్‌.