బాహుబలి-2 అప్పుడే 87 కోట్లు వచ్చేశాయి!

రజిని కబాలి డివైడ్ టాక్ తో కలెక్షన్స్ డల్ అయినట్టు తెలుస్తోంది.రిలీజ్ కి ముందు బాహుబలి రికార్డ్స్ ని కబాలి క్రాస్ చేస్తుందని అంతా ఊదరగొట్టేసారు.అయితే సినిమా రిలీజ్ అయ్యాక చతికిలబడింది.కలెక్షన్స్ ఇప్పటికీ బానే వున్నా అవి బాహుబలి కలెక్షన్స్ ని క్రాస్ చేసే రేంజ్ లో లేవనే టాక్ వినిపిస్తోంది.

కబాలి తో కంగుతిన్న డిస్టిబ్యూటర్స్ చూపు బాహుబలి -2 పడినట్టు తెలుస్తోంది.బాహుబలి మొదటి పార్ట్ సృష్టించిన కలెక్షన్స్ సునామి ని దృష్టిలో ఉంచుకుని ఎలాగైనా పార్ట్-2 రైట్స్ దక్కించుకోవాలని ఇప్పటినుండే ప్రయత్నాలు మొదలుపెట్టేశారు.బాహుబలి రికార్డ్స్ ని మళ్ళీ బాహుబలి 2 నే క్రాస్ చేస్తుందని అందరు బలంగా నమ్ముతున్నారు.బాహుబలి తర్వాత ఎన్నో పెద్ద సినిమాలు రిలీజ్ అయినా బాహుబలి బెంచ్ మార్క్ ని టచ్ చేయలేకపోయాయి.

ఎలాగైనా బాహుబలి 2 రైట్స్ దక్కించుకోవడం కోసం నిర్మాతల కోసం పడిగాపులుకాస్తున్నారు.ఫ్యాన్సీ రేట్లు ఇచ్చి కొనడానికి రెడీ అవుతున్నారు.డబ్బు కట్టలతో ఇప్పటి నుండే బేరసారాలు జరుపుతున్నారు. ఎలాగైనా ఆ సినిమా హక్కులు దక్కించుకోవాలని ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు.

అయితే బాహుబలి-2 ప్రీ రిలీజ్ బిజినెస్ లో సరికొత్త రికార్డు క్రీట్ చేసినట్టు సమాచారం.ఇప్పటికే ఈ సినిమా ఓవర్‌సీస్‌లో విడుదల చేసేందుకు ఓ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ ఏకంగా రూ. 37 కోట్లుతో డీల్ కుదుర్చుకున్నట్లు సమాచారం. ప్రీ రిలీజ్‌ బిజినెస్‌లో ఇది ఒక రికార్డు.తమిళ రైట్స్ కోసం 50 కోట్ల డీల్ జరిగినట్టు తెలుస్తోంది.అంటే సినిమా షూటింగ్ దశలో ఉండగానే దాదాపుగా 87 కోట్ల బిజినెస్ జారిపోయిందన్నమాట.అంతేకాదు బాహుబలి ప్రపంచ వ్యాప్తంగా 650 కోట్లు వసూలు చేస్తే రాబోయే బాహుబలి 2 1000 కోట్లు వసూళ్లు రాబట్టడం ఖాయమని ప్రచారం జరుగుతోంది.