పరిటాల అనుచరులు హత్య:సొంత పార్టీ వాళ్లే

అనంతపురం లో మళ్ళీ ఫ్యాక్షన్ బుసలు కొట్టింది.పాత కక్షలు భగ్గుమన్నాయి.ఇద్దరు పరిటాల రవి అనుచరులు దారుణ హత్యకు గురయ్యారు.గోపీనాయక్, వెంకటేష్ నాయక్ లను గుర్తు తెలియని వ్యక్తులు గురువారం హతమార్చారు.ప్రత్యర్థులు గోపి వెంకటేష్ లను ఆటోతో డీ కొట్టించి వేట కొడవళ్ళతో అతి కిరాతకంగా హతమార్చారు.

అయితే ఇప్పటివరకు రాజకీయ ప్రత్యర్థులు ఫ్యాక్షన్ కి బలవ్వడం చూస్తున్నాం.కానీ ఈ జంట హత్యలు, హతులు,దోషులు కూడా ఒకే పార్టీకి చెందిన వారు కావడం గమనార్హం.గోపి,వెంకటేష్ ఇద్దరు దివంగత పరిటాల రవికి అనుచరులు.పరిటాల రవి మరణించాక కూడా పరిటాల శ్రీరామ్ అనుచరులుగా కొనసాగుతున్నారు.అయితే ఈ హత్యలకు అనంతపురం MLA ప్రభాకర్ చౌదరి వర్గీయులే చేసినట్లుగా పోలీసులు ప్రాథమిక దర్యాపుతులో తేల్చారు.

గత కొంత కాలంగా ప్రభాకర్ చౌదరి వర్గానికి, పరిటాల వర్గానికీ విభేదాలున్నట్లు చెబుతున్నారు. పరిటాల శ్రీరామ్ అనంతపురం రాజకీయాల్లో పెత్తనం చెలాయించడం ప్రభాకర్ చౌదరి వర్గానికి గిట్టడం లేదని..ఈ విషయంలోనే గత కొద్ద్ది రోజులుగా రెండు వర్గాల మధ్యా పోరు నడుస్తున్నట్టు సమాచారం.

అయితే అనంత టీడీపీ లో రాజకీయ ఆధిపత్యం కోసం జరిగిన ఈ జంట హత్యలు కలకలం సృష్టిస్తున్నాయి. వీరిద్దరూ తమకు MLA ప్రభాకర్ చౌదరి నుండి ప్రాణహాని ఉందని గతంలో మీడియా ముఖంగా తెలియజేసినా ప్రయోజనం లేకపోయింది. స్వయానా పరిటాల అనుచరులు అయిఉండి కూడా, పరిటాల శ్రీరామ్ కు మొరపెట్టుకున్నా ప్రాణాల్ని దక్కించుకోలేక పోయారు. అనంత టీడీపీలో ఈ అంతర్గత పోరు ముందుముందు ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందో అని పార్టీ వర్గాలు ఆందోళన చెబుతున్నాయి.