రవిబాబు రూటే సపరేటు:పందిపిల్ల సాఫ్ట్ వేర్

విలక్షణమైన నటుడిగా .. టాలెంటెడ్ డైరక్టర్‌గా రవిబాబు గుర్తింపు తెచ్చుకున్నారు. తాను దర్శకత్వం వహించే సినిమాలకి ‘అ’ అనే అక్షరంతో టైటిల్ మొదలయ్యేలా చూసుకోవడం ఆయన సెంటిమెంట్. అల్లరి .. అనసూయ .. అవును చిత్రాలు అలా వచ్చినవే.

ఆ సెంటిమెంట్ తోనే తన తాజా చిత్రానికి ‘అదుగో’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు రవిబాబు. సాధారణంగా సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశాలకి ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చే రవిబాబు.. ఈసారి ఒక ప్రయోగానికి సిద్ధపడ్డారు. పందిపిల్లల నేపథ్యంతో ముడిపడిన ఒక కథను ఆయన తెరకెక్కించారు. దీనికోసం ఖరీదైన సాఫ్ట్ వేర్ ను ఉపయోగించడం విశేషం. ఈ సినిమాలో అభిషేక్ – నాభ ప్రధానమైన పాత్రలను పోషించారు. మిగతా లాంఛనాలన్నీ పూర్తి చేసుకుని త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.