ధోని లవ్ స్టోరీ ఫెయిల్ అయిందట!

తన హార్డ్ హిట్టింగ్ తో బౌలర్లను ఉతికారేసే ధోనీ జీవితంలో ఓ విషాదగాధ ఉంది. మహీ ఫస్ట్ లవ్ విషాదాంతం అయింది. టీమిండియాలోకి రాకముందే ధోనీ ప్రేమలో పడ్డాడు. ప్రియాంక ఝా అనే అమ్మాయిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాడు. ఆమే తన జీవితంగా బతికాడు. ప్రియాంకను పెళ్లి చేసుకుందామనుకున్న ధోనీ.. ఓవైపు ప్రాక్టీస్ చేస్తూనే ఖాళీ సమయాల్లో ఆమెతో గడిపేవాడు. కానీ మహీ అనుకున్నది జరగలేదు. ఓ యాక్సిడెంట్ లో ప్రియాంక చనిపోవడంతో ధోనీ ఒంటిరివాడయ్యాడు.

ప్రేయసి మరణంతో ధోనీ చాలా కుంగిపోయాడు. రాంచీలో ఉండలేకపోయాడు. ఆ బాధలో ఉండగానే ధోనీకి టీమిండియాలో చోటు వచ్చింది. అంతర్జాతీయ క్రికెట్ లో అడుగుపెట్టి సంచలనాలు సృష్టించాడు. భారత జట్టులోకి వచ్చినా ధోనీ మాత్రం ప్రియాంకను మర్చిపోలేకపోయాడు. కానీ క్రమంలో క్రికెట్ పైనే ఎక్కువ దృష్టి పెట్టి ఆ జ్ఞాపకాల నుంచి బయటకు వచ్చేశాడు. ఆ తర్వాత ధోనీ టీమిండియా కెప్టెన్ అయ్యాడు. చిన్ననాటి స్నేహితురాలు సాక్షిసింగ్ రావత్ ను పెళ్లి చేసుకున్నాడు.

పర్సనల్ మేటర్స్ ను ఎప్పుడూ బయటకి చెప్పని ధోనీ లవ్ స్టోరీ ఎలా బయటికొచ్చిందనుకుంటున్నారు. ధోనీ జీవితం ఆధారంగా బాలీవుడ్ లో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఆ సినిమాలో ధోనీ లైఫ్ గురించి పలు ఇంట్రెస్టింగ్ అంశాలు బయటకిరానున్నాయి. ధోనీ లవ్ స్టోరీని సినిమాలో చాల్ ప్రత్యేకంగా చూపించనున్నారు. ఎం.ఎస్.ధోనీ.. ది అన్ టోల్డ్ స్టోరీ పేరుతో వస్తోన్న ఈ సినిమాలో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ధోనీ క్యారెక్టర్ చేస్తున్నాడు. నీరజ్ పాండే దర్శకత్వం వహిస్తుండగా.. ధోనీ ప్రేయసి పాత్రలో లోఫర్ ఫేమ్ దిశా పటానీ నటిస్తోంది.