క‌బాలి మ‌ధ్య‌లో ప్ర‌భాస్ పెళ్ళి!!

ప్రభాస్ కి పెళ్లా అనుకుంటున్నారా?అయితే మీరు తప్పులో కాలేసినట్టే.పెళ్లి సరే మధ్యలో కబాలి ఏంటనే గా మీ సందేహం.అయితే అసలు స్టోరీ చదవాల్సిందే.మెట్ట‌మెద‌టి సారిగా రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ అభిమానుల‌కోసం చేస్తున్న చిత్రం ఆవు పులి మ‌ధ్య‌లో ప్ర‌భాస్ పెళ్ళి. ఆ చిత్రానికి సంభందించిన మెష‌న్ పోస్ట‌ర్ ఇటీవ‌లే విడుద‌ల చేశారు. ఇప్పుడు ధియోట్రిక‌ల్ ట్రైల‌ర్ ని రిలీజ్ చేస్తున్నారు.

అయితే ఈ సారి సౌత్ఇండియ‌న్ సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీ కాంత్ హీరోగా మెస్ట్ క్రేజియ‌స్ట్ ఫిల్మ్ క‌బాలి చిత్రంతో పాటు క‌బాలి తెర‌పై ఈ ట్రైల‌ర్ అల‌రించ‌నుంది. పోస్ట్‌ప్రోడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు పూర్తిచేసుకుని అగ‌ష్టులో చిత్రాన్ని విడుద‌ల చేయ‌టానికి స‌న్నాహ‌లు చేస్తున్నారు. శ్రీమ‌తి శైల‌జ స‌మ‌ర్ప‌ణ‌లో, రెడ్ కార్పేట్ రీల్స్ ప‌తాకం పై, ఏ.ర‌వితేజ‌, అశ్విని చంద్ర‌శేఖ‌ర్‌, భానుశ్రీ, జ‌బ‌ర్ద‌స్ట్ వేణు, అప్పారావు లు న‌టించ‌గా, బాహుబ‌లి కాళ‌కేయుడు ప్ర‌భాక‌ర్ ప్ర‌ధాన‌పాత్ర‌లో న‌టించారు. ఎస్‌.జె.చైత‌న్య ద‌ర్శ‌కుడు. క‌బాలి విడుద‌ల రోజునుండి ఆంద్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణా రాష్ట్రాల్లో అన్ని స్క్రీన్స్ లో ఈ ట్రైల‌ర్ వ‌స్తుంది.