ఏపీ సాధించింది 1st ర్యాంక్

ఇప్పటికే ఏపీకి దక్కాల్సిన పలు బెస్ట్ ర్యాంక్ లు దక్కకుండా పోతున్నాయని గుర్రుగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం ఎట్టకేలకు ఊరటనిచ్చింది.అరుదైన అవార్డ్ ఏపీని వరించింది.ఇప్పటికే పెట్టుబడు,ఆకర్షణ,ఈజ్ అఫ్ డూయింగ్ బిసినెస్ వంటి వాటిలో తామే నంబర్ 1 అయినా తమకు దక్కాల్సిన గుర్తింపు దక్కక పోవడంపై కేంద్రంపై ఏపీ బాహాటంగానే తమ ఆక్రోశాన్ని,ఆవేదనను బయటపెట్టింది.

దేశంలోని వివిధ రాష్ట్రాలకు ప్రభుత్వ పథకాల అమలులో వివిధ కేటగిరీల్లో ఇచ్చే అవార్డులను కేంద్రం తాజాగా ప్రకటించింది. డిజిటైలేజేషన్ రంగంలో ఏపీ ప్రభుత్వం ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది.ఢిల్లీ లో జరిగే ఈ అవార్డుల ప్రదానోత్సవంలో ఏపీ ఐటీ శాఖ కార్యదర్శి ప్రద్యుమ్న కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు నుంచి ఈ అవార్డు ను అందుకోనున్నారు.ఎట్టకేలకు తమకు దక్కిన గౌరవం,గుర్తింపు పై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు,ప్రభుత్వ వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఒక్క డిజిటలైజేషన్ మాత్రమే కాకుండా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాడకంలో ఆంద్రప్రదేశ్ మిగతా రాష్ట్రాలకంటే ముందుంది.పాలనా వ్యవస్థ,ప్రజలకి ప్రభుత్వానికి అనుసంధానంగా ఉన్న పెన్షన్ల పంపిణీ, రేషన్ సరుకులు,ఆధార్,సర్టిఫికెట్ల జారీ,ఈసీ, ఓటర్ నమోదు,దస్తావేజులు, ఇలా అన్నిటిలో ఏపీ ప్రభుత్వం డిజిటలైజేషన్ తీసుకొచ్చింది.ఇవే కాకుండా రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపులోనూ ఏపీ డిజిటల్ వ్యవస్థనే నమ్ముకుంది.

కొత్తగా ఏర్పడిన ఏపీ ప్రభుత్వ మొత్తం రెవెన్యూ శాఖనే డిజిటలైజేషన్ చేసి అరుదైన ఘనతను సొంతం చేసుకుంది.ఇక చంద్రబాబు,డిజిటల్ మీడియా ఎంతగా పెనవేసుకుపోయారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.బాబు డిజిటల్ కల ఈ నాటిదికాదు.చంద్రబాబు ఎటువంటి సమీక్షలు,రివ్యూలు జరిపినా డిజిటల్ మీడియా ద్వారానే నిర్వహిస్తుంటారు.కేబినెట్ మీటింగ్ లు కూడా డిజిటల్ పద్దితిలోనే బాబు నిర్వహిస్తుంటారు.ముఖ్యమంత్రికి డిజిటల్ విజన్ ఉండడం వల్లనే ఈ అవార్డు రాష్ట్రానికి వచ్చిందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.