ఇలియానా ఆశలన్నీ దానిపైనే

ప్రస్తుతం అవకాశాల్లేక ఖాళీగా ఉన్న హీరోయిన్స్‌లో ఫస్ట్‌ లిస్టులోకి చేరిపోయింది ముద్దుగుమ్మ ఇలియానా. ఒకప్పుడు అందరి స్టార్‌హీరోల పక్కన హీరోయిన్‌గా నటించి సక్సెస్‌ఫుల్‌ హీరోయిన్‌ అన్పించుకుంది ఇల్లూ బేబీ. ఇప్పుడు అవకాశాల్లేక విమర్శలతో వార్తల్లోకెక్కుతోంది. తాజాగా బాలీవుడ్‌లో ఆమె చేతిలో ఉన్న ఒకే ఒక సినిమా ‘రుస్తుం’. అక్షయ్‌కుమార్‌ హీరోగా తెరకెక్కుతోన్న ఈ సినిమా ట్రైలర్‌ తాజగా విడుదలయ్యింది. ఆ ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్‌ వస్తోంది. ట్రైలర్‌ కన్నా, అందులో ఇలియానా నటనకే ఎక్కువ రెస్పాన్స్‌ వస్తోంది. అంత గొప్పగా ఉంది ఈ ముద్దుగుమ్మ నటన.

మరి ఇంత పాజిటివ్‌ రెస్పాన్స్‌తో వస్తోన్న ఈ సినిమా గనుక ఇలియానాకి సక్సెస్‌నిస్తే మళ్లీ ఆమె పేరు మార్మోగిపోతుందనడంలో అతిశయోక్తి లేదు. అందుకే ఇల్లూ బేబీ ఈ సినిమా పైనే తన ఆశలన్నీ పెట్టుకుంది. ఆగష్టు 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. సో ఆ రోజుతో ఇలియానా అదృష్టం తెలియనుంది. అసలే అవకాశాల కోసం చాలా ఈగర్‌గా ఎదురు చూస్తోన్న ఈ ముద్దుగుమ్మ అందితే ఏ చిన్న అవకాశాన్ని వదులుకోనని చెబుతోంది. కానీ ఇది నిన్నటి మాట. ఇప్పుడు ఈ సినిమాకి వచ్చిన రెస్పాన్స్‌ని బట్టి ఆమె మనసు మార్చుకుందట. మళ్లీ తనకి మెచ్చిన పాత్రలు వస్తేనే నటిస్తానంటోంది. ఇదివరకటిలా హీరోయిన్‌ పాత్రలూ, అందులోనూ ప్రాధాన్యత ఉన్న పాత్రలే చేస్తానంటోంది. వావ్‌ వాట్‌ ఎ ఛేంజ్‌ ఇలియానా!