అందుకే మామకు తగ్గ కోడలు సమంత!

చెన్నై బ్యూటీ సమంతా పట్టిందల్లా బంగారంలా మారుతోంది. ఇప్పటికే కోలీవుడ్-టాలీవుడ్‌ల్లో మూడు బ్లాక్‌బస్టర్స్ కైవసం చేసుకుని టాప్‌ పొజిషన్‌లోకి వచ్చేసింది. కేరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నా కొత్తగా వస్తున్న అవకాశాలను ఒప్పుకోవడంలేదు. జూనియర్ ఎన్టీఆర్‌తో ‘జనతా గ్యారేజ్‌’ కంప్లీట్ అయితే అమ్మడు ఖాళీనే. అక్కినేని వారసుడు నాగచైతన్యతో త్వరలోనే వివాహబంధంలోకి అడుగిడుతుందని.. అందుకే నయా ప్రాజెక్టులకు నో చెప్పేస్తోందన్నది సినీ జనాల మాట. దీనిపై అక్కినేని కుటుంబమే ఓ క్లారిటీ ఇవ్వాలి.

ఈ సంగతి పక్కనపెడితే.. సమంతా సొంతంగా నిర్మాణ సంస్థను ఏర్పాటు చేయాలని యోచిస్తోందట. ఇటీవలే ఆమె.. కన్నడలో హిట్‌ అయిన ‘యు టర్న్’ అనే సినిమాను బెంగళూరు వెళ్లి మరీ ప్రత్యేక షో వేయించుకుని చూసిందట. ఈ సినిమా కథాంశం టాలీవుడ్‌-కోలీవుడ్‌లకు సూటవుతుందని చెప్పి.. సొంత ప్రొడక్షన్‌ బ్యానర్‌లో రీమేక్‌ చేస్తానందట. ఈ విషయమై మన సామ్ త్వరలోనే ఓ స్టేట్‌మెంట్‌ ఇవ్వొచ్చని సమాచారం.నాగార్జున ఇప్పటికే సక్సెస్ ఫుల్ నిర్మాతగా బిసినెస్ మాన్ గా మనందరికీ తెలిసిందే.ఇక సమంత నిర్మాణ రంగం వైపు అడుగులేయడం చూస్తుంటే పెళ్లికాకుండానే మామ గారిని ఇంప్రెస్ చేసేటట్టే ఉంది సమంత.