మళ్లీ అందాల ఆరబోతకు రెడీ అవుతున్న “రష్మి”….

Trailer Release Poster

బాలీవుడ్‌లో ఆడల్ట్‌ సినిమాల కల్చర్‌ ఎక్కువగా వుంటుంది. ఈ మధ్య కామెడీ పేరుతో అలాంటి సినిమాలు ఎక్కువ అయిపోతున్నాయి. ఇలాంటి సినిమాల కోసమే పోర్న్‌ రంగం నుంచి ప్రత్యేకించి సన్నీలియోన్‌ని బాలీవుడ్‌కి దించారు. అయితే ఇప్పుడు సన్నీనే కాకుండా ఎందరో భామలు తమ అందచందాలతో ఈ అడల్ట్‌ మూవీస్‌లో తమ అందాల విందు చేస్తున్నారు. తక్కువ కాస్టింగ్‌తో, అతి తక్కువ ఖర్చుతో చాలా తక్కువ టైంలోనే ఈ సినిమాలు కంప్లీట్‌ అయిపోతాయి. దాంతో సినిమా హిట్‌, ఫ్లాప్‌తో సంబంధం ఉండదు డైరెక్టర్‌, ప్రొడ్యూసర్స్‌కి. ఇక సినిమా కొంచెం బాగుందని టాక్‌ వచ్చిందంటే వసూళ్ల పండగ చేసుకుంటారు.

అయితే ఇప్పుడు అలాంటి సినిమాల ట్రెండు తెలుగులోనూ పెరుగుతోంది. ఈ తరహా సినిమాలకు ప్రస్తుతం బుల్లితెర హాట్‌ యాంకర్‌ రేష్మి బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారింది. ఈ భామ ‘గుంటూర్‌ టాకీస్‌’ సినిమాలో తన అందాల ఆరబోతతో కనువిందు చేసింది. సినిమా స్టోరీ ఎలా ఉన్నా విచ్చలవిడిగా అందాల విందు చేయడంతో అడల్ట్‌ ప్రేక్షకులకి దగ్గర అయిపోయింది. ఇప్పుడు మళ్లీ ‘అంతం’ అనే సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది ఈ హాటెస్ట్‌ సుందరి. ఈ సినిమా ఒక థ్రిల్లర్‌ ఎంటర్‌టైనర్‌. అయితే సినిమాలో థ్రిల్లింగ్‌ సంగతేమో కానీ రేష్మీ అందాల విందు మాత్రం ‘గుంటూర్‌ టాకీస్‌’ సినిమాని మించిపోయి ఉంటుందని ఇండస్ట్రీలో మాట్లాడుకుంటున్నారు. తెలుగు తెరకు పరిచయమై ఈ భామ చాలా కాలం అయినప్పటికీ ఇప్పుడే తనకి టైం బాగుంది. సో టైం బాగున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలి కదా. అందుకే ఎటువంటి అవకాశాన్ని వదలకుండా అందిపుచ్చుకుంటోంది రేష్మి. ‘అంతం’ సినిమా తర్వాత రేష్మి రేంజ్‌ ఇంకా పెరిగిపోనుందట.