పోలిస్ స్టేషన్ లో చెర్రీ

పోలీసు కథలంటే మన కథానాయకులకు చాలా మక్కువ. అసలు సిసలైన హీరోయిజం చూపించే అవకాశం ఈ కథల్లోనే ఎక్కువ దొరుకుతుంది. మాస్‌కి త్వరగా దగ్గరైపోవొచ్చు. దానికి తోడు స్టైలిష్‌గానూ కనిపించొచ్చు. అందుకే రామ్‌చరణ్ మరోసారి ఖాకీ కట్టేశారు. పోలీసు స్టేషన్‌లో హంగామా మొదలెట్టారు. రామ్‌చరణ్ కథానాయకుడిగా గీతా ఆర్ట్స్ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. సురేందర్‌రెడ్డి దర్శకుడు. రకుల్‌ప్రత్‌సింగ్ కథానాయిక. అరవింద్ స్వామి ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. నవదీప్ కీలక పాత్రధారి. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది. పోలీస్ స్టేషన్ సెట్‌లో రామ్‌చరణ్ పోలీస్ గెటప్ వేసి హంగామా చేస్తున్నాడు. ప్రస్తుతం పోలీస్ స్టేషన్ నేపథ్యంలో సాగే సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. తమిళంలో ఘన విజయం సాధించిన తని ఒరువన్‌కి రీమేక్ ఇది. ధ్రువ అనే పేరు పరిశీలిస్తున్నారు. దసరా బరిలో ఈ సినిమాను దింపాలన్నది చిత్ర బృందం ఆలోచన.