చైతు సమంతల “కల్యాణం”

కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో అక్కినేని నాగచైతన్య ఒక సినిమా చేయనున్నాడనే వార్త కొంతకాలంగా వినిపిస్తోంది. అన్నపూర్ణ బ్యానర్ పై ఈ సినిమా రూపొందనుంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో నాయికగా సమంతాను ఎంపిక చేశారనే విషయం మరింత ఆసక్తిని రేకెత్తించింది.

ఇటీవల చైతూ .. సమంతల గురించిన వార్తలు ఓ రేంజ్ లో షికారు చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సమంతాను తీసుకోవడం ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే, ఈ సినిమాకి ‘కల్యాణం’ అనే టైటిల్ ను పెడుతున్నారని తాజా సమాచారం. వీరిద్దరి సినిమాకి ఈ క్రేజీ టైటిల్ ను ఫిక్స్ చేయడం హాట్ టాపిక్ గా మారుతుందనడంలో డౌట్ లేదు.