ఎన్టీఆర్ లుక్ సూపర్

ఎన్టీఆర్ ఫ్యాన్స్ వెయిట్ చేసిన రోజు రానే వచ్చింది. రెండు బ్లాక్ బస్టర్లతో మాంచి ఊపు మీద వున్న కొరటాల శివ డైరక్షన్ లో ఎన్టీఆర్ చేస్తున్న జనతా గ్యారేజ్ సినిమా ఫస్ట్ లుక్ అంటూ రెండు పోస్టర్లు బయటకు వచ్చాయి. శ్రీమంతుడులో మహేష్ ను సైకిల్ ఎక్కించిన శివ, ఈ సినిమాలో ఎన్టీఆర్ ను బుల్లెట్ ఎక్కించాడు.

బులెట్ పై గాగుల్స్ పెట్టుకుని ఎన్టీఆర్ లుక్ సూపర్ గా వుంది అంటే అతిశయోక్తి కాదు. లైట్ బియర్డ్ తో, మాన్లీగా వున్నాడు ఎన్టీఆర్. ఎన్నారైగా నాన్నకు ప్రేమతో సినిమా కోసం ఓ కొత్త హెయిర్ స్టయిల్ ట్రయ్ చేసాడు. ఈ సినిమాకు రెగ్యులర్ ఫార్మాట్ లోకి వచ్చినా కూడా ఆ లుక్ అదిరింది.

రెండో స్టిల్ యాజ్ యూజువల్ గా వున్నా, బైక్ మీద కూర్చున్న స్టిల్ మాత్రం అభిమానులను అలరిస్తుందనడంలో సందేహం లేదు. మైత్రీ మూవీస్ నిర్మాతలు నవీన్,రవిశంకర్, మోహన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి బిజినెస్ సర్కిళ్లలో విపరీతమైన క్రేజ్ ఇప్పటికే వచ్చింది. పోటా పోటీ ఆపర్ల మీద బిజినెస్ జరిగిపోయింది. ఇక జనాల్లో హైప్ రావడానికి ఈ స్టిల్స్ తో శ్రీకారం చుట్టారు.