కేసీఆర్‌కి మ‌రోసారి హైకోర్టు జలక్!

తెలంగాణ సీఎం కేసీఆర్‌కి హైకోర్టు నుంచి షాక్ మీద షాక్ త‌గులుతూనే ఉంది. తాజాగా కేసీఆర్ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్న రాష్ట్ర భూసేక‌ర‌ణ చ‌ట్టంపై హైకోర్టు అక్షింత‌లు వేసింది. ఏక‌ప‌క్షంగా తీసుకున్న కొన్ని నిర్ణ‌యాలు రైతుల‌కు విరుద్ధంగా ఉన్నాయ‌ని వ్యాఖ్యానించ‌డంతోపాటు దీని అమ‌లుపై స్టే విధించింది. ఇది కేసీఆర్ స‌ర్కారుకు శ‌రాఘాత‌మ‌నే చెప్పాలి. అస‌లు ఏం జ‌రిగిందంటే.. రాష్ట్రంలో కేసీఆర్ అధికారం చేప‌ట్టిన త‌ర్వాత త‌న దంటూ ప్ర‌త్యేక పాల‌న ప్రారంభించాల‌ని డిసైడ్ అయ్యారు. ఈ క్ర‌మంలోనే […]

మరో మల్లన్నసాగర్‌ గా తయారవుతున్న ఫార్మా సిటీ…

ఫార్మాసిటీ…. తొలుత 6000 ఎకరాల్లో ఫార్మాసీటీకి ఊపిరి పోయాలని అనుకున్నా, కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన మార్గదర్శకాలతో  12,500 ఎకరాలకు పెంచారు. ఈ ప్రాజెక్టుకు ఎన్డీయే సర్కారు  జాతీయ పెట్టుబడి, తయారీ కేంద్రం హోదా సైతం మంజూరు చేసిందని టీఎస్‌ఐఐసీ అధికారులు అంటున్నారు.ఫార్మా సిటీ కోసం రంగారెడ్డి జిల్లా కందుకూరు, యాచారం మండలాలు, మహబూబ్‌నగర్‌ జిల్లా ఆమనగల్‌ మండలాల్లోని 19 గ్రామాల్లో ఇప్పటికే భూసేకరణకు శ్రీకారం చుట్టారు. అయితే కందుకూరు మండలం ముచ్చర్ల ప్రధాన కేంద్రంగా […]

డ్యామిట్‌, ఇలా ఎందుకయ్యింది?

తెలంగాణ ముఖ్యమంత్రి కెసియార్‌, హైకోర్టులో నేడు తమ ప్రభుత్వం జారీ చేసిన రెండు జీవోలు కొట్టివేయడం పట్ల అసహనంతో ఉన్నారని సమాచారమ్‌. ఏ ప్రభుత్వమైనా హైకోర్టు నుంచి ఇలాంటి పరిస్థితులు ఎదురయినప్పుడు షాక్‌కి గురవడం మామూలే. పాలనా పరంగా తీసుకునే నిర్ణయాలు ఒక్కోసారి వివాదాస్పదమవుతుంది. న్యాయస్థానాల జోక్యంతో తాము జారీ చేసిన జీవోలని వెనక్కి తీసుకోవడం, సవరించుకోవడం మామూలే. అయినప్పటికీ తెలంగాణలో ప్రాజెక్టులు నిర్మించడం ద్వారా వేలాది, లక్షలాది ఎకరాలకు నీళ్ళు అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్న తమ […]

కెసిఆర్ కి హైకోర్ట్ లో మళ్ళీ పేలింది

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. రైతుల నుంచి నేరుగా భూమి కొనుగోలు చేసేందుకు ఉద్దేశించి తీసుకువచ్చిన 123 జీవోను హైకోర్టు ఈ రోజు కొట్టివేసింది.  భూ సేకరణ 2013 చట్టం అమల్లో ఉండగా జీవో 123 ప్రకారం ఎలా రిజిస్ట్రేషన్ చేసుకుంటారని సూటిగా ప్రశ్నించింది. గత కొన్ని రోజులుగా భూ సేకరణపై రగడ నెలకొంటున్న విసయం తెలిసిందే. 2013 భూసేక‌ర‌ణ చ‌ట్టం ప్ర‌కారం కాకుండా 123 జీవో ప్ర‌కారం ప్రభుత్వం నేరుగా భూముల‌ను సేక‌రిస్తోందంటూ, దీని […]

కెసిఆర్ కి బిగుస్తున్న మల్లన్న ఉచ్చు

మల్లన్న సాగర్ ఏ ముహూర్తాన మొదలు పెట్టారో కానీ అడుగడునా అధికార పార్టీ కి ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. ప్రతిపక్షమే లేకుండా చేసిన కెసిఆర్ కి మల్లన్న రూపంలో అసలైన ప్రతిపక్షం పుట్టుకొచ్చింది.రోజు రోజుకి మల్లన్న వివాదం తీవ్ర రూపం దాలుస్తోంది తప్ప సద్దుమణగడం లేదు. తాజాగా మెదక్ జిల్లాలోని మల్లన్నసాగర్ ముంపు గ్రామాల్లోతీవ్ర ఉద్రిక్తత నెలకొంది.కొండపాక మండలం ఎర్రవల్లి శివారులో రాజీవ్ రహదారి ముట్టడికి యత్నించిన భూనిర్వాసితులపై పోలీసులు ప్రతాపం చూపారు. లాఠీలతో ముంపు బాధితులపై […]

మల్లన్న దెబ్బ కి అల్లాడుతున్న కేసీఆర్…

మల్లన్నసాగర్‌… ఈ పేరింటేనే ఇపుడు టీఆర్‌ఎస్‌ సర్కార్‌కు గొంతపట్టేస్తోంది. జీవో 123 ప్రకరాం మంచినీళ్ల ప్రాయంగా భూములు సేకరిస్తున్న ప్రభుత్వానికి ‘ 2013 భూసేకరణచట్టం’ ఎక్కిళ్లు తెప్పిస్తోంది. ఇక ముందు సేకరించబోయే భూములతోపాటు.. ఇప్పటిదాకా సేకరించిన భూములకూ 2013 చట్టాన్నే వర్తింపజేయాల్సిన పరిస్థితి వచ్చింది. కుర్చీమీద కూర్చున్నది మొదలు… తనకు ఎదురేలేదన్నట్టు వ్యవహరిస్తున్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి తొలిషాక్‌ మల్లన్నసాగర్‌ రూపంలో తగిలింది. తాము అనుకున్నదే చేస్తామని మొండిపట్టుదలకు పోయిన సర్కారు హైకోర్టులో మెత్తబడింది. నిర్వాసితుల కోరిన విధంగా […]

రేవంత్ రెడ్డి దీక్షకు KCR కౌంటర్-ఇష్యూ క్లోజ్!!

మల్లన్నసాగర్ నిర్వాసితులకు ఎలా కోరుకుంటే అలా పరిహారం చెల్లిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. నిర్వాసితులకు పరిహారం చెల్లించేందుకు రెండు దారులు ఉన్నాయని.. ఒకటి 2013 భూసేకరణ చట్టం ప్రకారం అయితే రెండోది తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన 123జీవో. వీటిల్లో బాధితులు దేన్నైనా ఎంచుకోవచ్చని స్పష్టం చేసింది. అంతేకాదు ఒక్క బాధితుడికి కూడా అన్యాయం జరగకుండా పరిహారం చెల్లిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. టీ.టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మల్లన్నసాగర్ బాధితుల కోసం దీక్ష చేస్తున్నట్లు నాలుగు […]

మల్లన్నకు పెరుగుతున్న మద్దతు

రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో రెండేళ్ల తర్వాత ఓ ప్రజాఉద్యమం ఊపిరి పోసుకుంది. ఈ రెండేళ్లలో విపక్షాలు వివిధ అంశాలపై ఎన్ని ఆందోళనలు నిర్వహించినా లభించని మద్దతు, మల్లన్నసాగర్ భూసేకరణపై రైతులు చేస్తున్న ఉద్యమానికి లభించడం విశేషం. సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న మెదక్ జిల్లా ఏటిగడ్డకిష్టాపూర్, పల్లెపహాడ్, వేములగట్, తొగుట గ్రామాలను ముంచేలా నిర్మించనున్న మల్లన్నసాగర్ ప్రాజెక్టు కోసం గజం భూమి కూడా ఇచ్చేది లేదన్న నాలుగు గ్రామాల రైతులకు అనుకూలంగా విపక్షాలు, జాక్ చైర్మన్ […]

మల్లన్నపై కేసీఆర్‌ మొండి వైఖరి ఎందుకట!!

మల్లన్న సాగర్‌ రోజురోజుకీ వివాదాస్పదమవుతోంది. తెలంగాణ ప్రభుత్వానికి ఈ ప్రాజెక్ట్‌ కారణంగా పెద్ద ప్రమాదమే పొంచి ఉన్నట్లు కనిపిస్తున్నదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్న వేళ, ఇప్పటికీ ఈ వివాదంపై కెసియార్‌ సర్కార్‌ స్పందన ఏమాత్రం సబబుగా లేదు. ప్రాజెక్టు నిర్వాసితులను ఆదుకోమని బాధితులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తుంటే, వారి డిమాండ్లపై సానుకూలంగా స్పందించాల్సింది పోయి, తామే పెద్ద నిర్వాసితులమని తన తల్లిదండ్రులకు ఆ బాధ ఏంటో తెలుసని మంత్రి కెటియార్‌ చెప్పడం శోచనీయం. కెసియార్‌ ప్రాజెక్టు నిర్వాసితుడో […]