కమ్యూనిస్టులతో కలిసే..కేసీఆర్ ప్లాన్ ఇదే.!

మరో రెండు నెలల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటినుంచే అభ్యర్ధుల ఎంపికపై కే‌సి‌ఆర్ కసరత్తు చేస్తున్నారు. అభ్యర్ధుల ఎంపిక దాదాపు ఎండింగ్‌కు వచ్చిందని తెలిసింది. దాదాపు సిట్టింగులకే సీట్లు ఫిక్స్ అవుతున్నాయని తెలిసింది. ఇక బాగా ప్రజా వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలక్ సీటు ఇవ్వకూడదని కే‌సి‌ఆర్ డిసైడ్ అయ్యారు. ఇక వారు జంప్ అవ్వకుండా..అధికారంలోకి వస్తే వేరే పదవులు ఇస్తామని హామీలు ఇస్తున్నట్లు తెలిసింది. అటు కాంగ్రెస్ […]

కేసీఆర్ సర్కార్‌ను ఇబ్బంది పెడుతున్న పథకాలు…!

ఎన్నికల ముందు కేసీఆర్ ప్రభుత్వం తీసుకువస్తున్న సంక్షేమ పథకాలు అధికార పార్టీలో చిచ్చుపెడుతున్నాయి. లబ్దిదారుల ఎంపికలో ఎమ్మెల్యేలకు పవర్స్ ఇవ్వడం పట్ల సొంత పార్టీలోనే వ్యతిరేకత వస్తోంది. మెజార్టీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే వర్సెస్ లోకల్ లీడర్స్‌గా సీన్ మారుతోంది. ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలని పట్టుదలగా ఉన్న కేసీఆర్ అందుకోసం సరికొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. రెండు పర్యాయాల పాలనపై అసంతృప్తిగా ఉన్న ప్రజలను ఆకర్షించడానికి వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఒక్కో వర్గాన్ని మచ్చిక చేసుకోవడానికి ఎన్నికల పథకాలను […]

ఆ ఇద్దరు వారసులకు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్.!

వచ్చే ఎన్నికల్లో గెలుపు గుర్రాలకే సీట్లు ఇవ్వాలని చెప్పి తెలంగాణ సి‌ఎం కే‌సి‌ఆర్ చూస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు అందరికీ సీట్లు ఇస్తే గెలవడం కష్టమనే విషయం అర్ధమవుతుంది. ఎందుకంటే కొందరు ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత ఎక్కువగానే ఉంది. మొత్తం 119 సీట్లు ఉంటే అందులో 103 మంది బి‌ఆర్‌ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు. దీంతో 103 మందికి సీట్లు ఇస్తే బి‌ఆర్‌ఎస్‌కు రిస్క్. అందుకే ప్రజా వ్యతిరేకత ఎదురుకునే కొందరు ఎమ్మెల్యేలని పక్కన పెట్టాలని కే‌సి‌ఆర్ చూస్తున్నారు. ఇదే […]

ఓడేవాళ్లకు టికెటిచ్చేదెలా?

ఓడేవాళ్లకు టికెటిచ్చేదెలా?… 30 మంది సిటింగ్‌లకు చెడ్డ పేరు… కేసీఆర్‌ చేయించుకున్న సర్వేల్లో 30 మంది సిటింగ్గులపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లు గుర్తించారు. గత ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ గెలిచిన 88 స్థానాలకు తోడు ఇతర పార్టీల నుంచి 15 మంది ఎమ్మెల్యేలు అధికార పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. తాజా సర్వేలను బట్టి చూస్తే… ఈ 103 మందిలో ఇప్పుడు అనేక మందికి టికెట్‌ దక్కకపోవచ్చని సమాచారం. ఆయనొక మంత్రి.. ఎప్పుడూ కేసీఆర్‌ వెంట పలు కార్యక్రమాల్లో […]

ఎంపీ సీటుపైనే కేసీఆర్ ఫోకస్..చక్రం తిప్పగలరా?

వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ఏ సీటులో పోటీ చేస్తారు? మళ్ళీ గజ్వేల్ బరిలో నిలుస్తారా? లేక వేరే సీటుకు మారిపోయే ఛాన్స్ ఉందా? అది కాదు అనుకుంటే ఎంపీ సీటులో పోటీ చేస్తారా? అసలు ఆయన పోటీ చేసే సీటు క్లారిటీ రావడం లేదు. గజ్వేల్ బరిలో పోటీ చేయడంపై ఇంకా క్లారిటీ రాలేదు. ఇదే సమయంలో ఆయన ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఏదొక సీటులో పోటీ చేస్తారని టాక్ వచ్చింది. ఇప్పుడు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని […]

కేసీఆర్..జగన్‌ని హైలైట్ చేసింది అందుకేనా?

రాజకీయ అవసరాలకు తగ్గట్టుగా వ్యూహాలు వేసి సత్తా చాటగల నాయకుల్లో కేసీఆర్ కూడా ఒకరు. ఆయన ఏ సమయంలో ఎలాగైనా మాట్లాడేసి ప్రజలని ఆకర్షించగలరు. ఇక ఇప్పుడు ఎన్నికల సమయం దగ్గరపడటంతో ప్రజలని ఆకట్టుకునేలా కే‌సి‌ఆర్ ముందుకెళుతున్నారు. తాజాగా తెలంగాణ అసెంబ్లీలో సుదీర్ఘంగా అసెంబ్లీలో మాట్లాడి..ప్రతిపక్షాలపై విరుచుకుపడి..ఈ 9 ఏళ్లలో తాము తెలంగాణని అభివృద్ధి చేశామని చెప్పుకొచ్చారు. అన్నీ అంశాలని ఆయన కవర్ చేసుకుంటూ వచ్చారు. ఇదే సమయంలో కాంగ్రెస్ విధానాలని ఎండగట్టారు. అలాగే ఏపీలో కాంగ్రెస్ […]

కేసీఆర్‌కు ‘రైతు’లు కలిసొస్తారా?

రాజకీయాల్లో గెలుపోటములని శాసించేది ప్రధానంగా మహిళలు, రైతులు, యువత అనే చెప్పాలి. అందుకే ఏ పార్టీ అయిన ఈ మూడు వర్గాలని ఆకట్టుకునేందుకు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు తెలంగాణలో ఎన్నికల సమయం దగ్గరపడటంతో ప్రధాన పార్టీలు ఈ మూడు వర్గాలని ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలోనే అధికార బి‌ఆర్‌ఎస్ పార్టీ..మూడు వర్గాల ఓట్లని కొల్లగొట్టేందుకు చూస్తుంది. అయితే తెలంగాణ వచ్చిన అనుకున్న మేర యువతకు ఉద్యోగాలు రాలేదు. ఈ అంశంలో యువత కాస్త యాంటీగానే ఉంది. […]

జగన్ బాటలో కేసీఆర్… సక్సెస్ అవుతారా….!

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి… రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం అయినప్పటికీ… 2009లోనే తొలిసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. 2009లో కాంగ్రెస్ పార్టీ తరఫున కడప పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికైన జగన్… ఆ తర్వాత వైసీపీ స్థాపించారు. 2012 నుంచి దాదాపు ఏడేళ్ల పాటు ఎన్నో ఎదురు దెబ్బలు తిన్న జగన్… 2019లో బంపర్ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి సీటు దక్కించుకున్నారు. తొలి నుంచి తనదైన శైలిలో అనూహ్య నిర్ణయాలు తీసుకున్నారు జగన్. […]

ఎన్నికల వరాలు..కేసీఆర్ పక్కా ప్లాన్.!

మొత్తానికి ఎన్నికల ముందు కే‌సి‌ఆర్ ప్రభుత్వం..ప్రజలపై వరాల జల్లు కురిపించింది. మరో రెండు నెలల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్న నేపథ్యంలో..ప్రజలని ఆకర్షించే విధంగా కే‌సి‌ఆర్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తాజా కేబినెట్ సమావేశంలో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని నిర్ణయించింది. దీంతో ఆర్టీసీలో పని చేస్తున్న 43,373 మంది కార్మికులు ఇక ప్రభుత్వ ఉద్యోగులు కానున్నారు. ఈ అంశం రాజకీయంగా కూడా బి‌ఆర్‌ఎస్ […]