స్పైడ‌ర్ టీజ‌ర్ రివ్యూ: థ‌్రిల్లింగ్ యాక్ష‌న్ ఫీస్ట్ (వీడియో)

ప్రిన్స్ మ‌హేష్‌బాబు ఫ్యాన్స్ క‌ళ్ల‌ల్లో ఒత్తులు వేసుకుని మ‌రీ వెయిట్ చేస్తోన్న స్పైడ‌ర్ టీజ‌ర్ వ‌చ్చేసింది. సౌత్ ఇండియ‌న్ క్రేజీ డైరెక్ట‌ర్ ఏఆర్‌.మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమా గ‌త నాలుగు నెల‌లుగా వాయిదా ప‌డుతూనే వ‌స్తోంది. ఇక త్వ‌ర‌లోనే రిలీజ్‌కు రెడీ అవుతోన్న సినిమాల్లో సౌత్ ఇండియాలో మోస్ట్ వెయిటెడ్ మూవీస్‌లో స్పైడ‌ర్‌దే ఫ‌స్ట్ ప్లేస్‌.

ఇక మ‌హేష్‌బాబు 42వ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఈ రోజు స్పైడ‌ర్ టీజ‌ర్ రిలీజ్ అయ్యింది. 1.10 నిమిషాల నిడివి ఉన్న టీజ‌ర్ సింపుల్‌గా మైండ్ బ్లోయింగ్ అనేలా ఉంది. సినిమా కోసం ద‌ర్శ‌కుడు మురుగ‌దాస్ ఎంత‌లా క‌ష్ట‌ప‌డుతున్నాడో ? మేకింల్‌లో ఎలాంటి శ్ర‌ద్ధ ఉందో ఈ టీజ‌ర్ చెపుతోంది. టీజ‌ర్ ప్ర‌కారం స్టోరీ చూస్తుంటే ఇది ఓ ఇంటిలిజెన్స్ ఆఫీస‌ర్‌కు విల‌న్‌కు మ‌ధ్య జ‌రిగే యుద్ధంలా క‌నిపిస్తోంది. దేశాన్ని నాశ‌నం చేసే ఓ వినాశ‌క‌ర వైర‌స్‌ను క‌నుక్కున్న విల‌న్ ఎస్‌జె.సూర్య దాన్ని దేశంలో ఉన్న జ‌నాల మీద‌కు ప్ర‌యోగించ‌డంతో చాలా మంది చ‌చ్చిపోతారు.

ఇండియ‌న్ పోలీస్ శాఖ‌కే అతి పెద్ద స‌వాల్‌గా మారిన ఈ కేసును చేధించేందుకు ఇంటిలిజెన్స్ ఆఫీస‌ర్‌గా మ‌హేష్ ఎంట్రీ ఇస్తాడు. సునామి, భూకంపం త‌ర‌హాలో తాను క‌నిపెట్టిన ఆయుధం మాన‌వ‌జాతిని అంతం చేస్తాన‌ని స‌వాల్ విసురుతాడు. చివ‌ర‌కు అలాంటి వ్య‌క్తికి భ‌యం అంటే ఏంటో తెలిసేలా చేసిన మ‌హేష్ అత‌డి ఆయుధాన్ని నాశ‌నం చేసి, అత‌డిని ఎలా అంత మొందించాడ‌న్న‌దే స్పైడ‌ర్ క‌థ‌గా తెలుస్తోంది.

ఇక టీజ‌ర్‌లో ర‌కుల్ కెమిస్ట్రీ కాస్త త‌క్కువ‌గా ఉంది. ఓవ‌రాల్‌గా యాక్ష‌న్ ఫీస్ట్‌లా ఉంది. టీజర్ చివర్లో మహేష్ విలన్ తో చెప్పే డైలాగ్ ‘భయాన్ని పరిచయం చేయటం మాకు కూడా వచ్చు’ డైలాగ్ కేక పెట్టించేసింది. ఓవ‌రాల్‌గా టీజ‌ర్ సినిమాపై అంచ‌నాల‌ను అమాంతం పెంచేసింది. ఇక స్పైడ‌ర్ సెప్టెంబ‌ర్ 27న ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది.